Wednesday, November 20, 2024

Delhi – ఎన్నికల సంఘం ముందు హాజ‌రైన ఎపి సిఎస్, డిజిపిలు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఢిల్లీ చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వారిని వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీ వచ్చిన వారిద్దరూ నేటి సాయంత్రం ఈసీఐ ముందు హాజరయ్యారు.

కాగా, ఏపీలో పోలింగ్‌ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు సీఎస్‌, డీజీపీపై మండిపడింది. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది. ఎన్నికల్లో హింసకు తావులేకుండా చూడాలని తాము పదే పదే హెచ్చరించినా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.

- Advertisement -


ఎన్నికల అనంతర హింసాకాండను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అది ఎవరి వైఫల్యం? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవర్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి? అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని, వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో సిఎస్,డిజిపిలు మాచర్లలో మొత్తం 144 సెక్షన్ అమలు చేశామన్నారు సీఈసీకి వివరించారు. హింసాత్మక ఘర్షణ విషయంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టామని, పలువురు నేతలను హౌజ్ అరెస్ట్ చేశామని, శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఈసికి తెలిపారు.. .. ఎం ఇత‌ర ప్రాంతాల‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లు,తీసుకున్న చ‌ర్య‌ల‌పై సిఎస్,డిజిపీలు ఒక స‌మ‌గ్ర నివేదిక‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వారు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement