ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన తర్వాత వైసీపీపై టీడీపీ జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసింది. తాజాగా ఇప్పుడు వైసీపీ అదే దారిలో వెళ్లింది. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. టీడీపై ఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు.
కాగా, ఇటీవల టీడీపీ నేత పట్టాబి సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల అనంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. టీడీపీ కార్యాలయంలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష కూడా చేశారు. అనంతరం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి వైసీపీపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్ లో ఆమోదం తెలిపింది ఇవే..