అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్ల కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు ఉన్నత విద్యాశాఖను ఆదే శించింది. ఈ విద్యా సంవత్సరం (2022-23) ప్రవేశాలను ఆన్లైన్ ద్వారానే చేపట్టాలంటూ ఉన్నత విద్యా మండలి ఈ నెల 22వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరుపు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. డిగ్రీలో ఆన్లైన్ ప్రవేశాలను తప్ప నిసరి చేస్తూ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ న్యాయవాది కె రఘు వీర్ జోక్యం చేసుకుంటూ ఈ ఏడాది ఆన్లైన్ ఎన్రోల్మెంట్ ప్రారంభమైందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణ ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.