Tuesday, November 26, 2024

హత్య కేసులో నిందితుని అరెస్ట్

జి.కొండూరు : ఓ హ‌త్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం పోలీస్‌స్టేష‌న్లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో దర్యాప్తు అధికారి, మైలవరం సీఐ పి.శ్రీను వివ‌రాలు వెల్ల‌డించారు. కృష్ణా జిల్లా వెలగలేరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో అదే గ్రామానికే చెందిన చట్టు సోమయ్య (63) నైట్ వాచ్మెన్ గా పనిచేసే వాడు. ఇతడిని గ‌త ఏడాది డిసెంబ‌ర్ 11న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వైన్ షాప్ వద్ద దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత వైన్ షాప్ లో మద్యం సీసాలను దొంగిలించారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు నేతృత్వంలో మైలవరం సీఐ పి.శ్రీను ఆధ్వర్యంలో జి.కొండూరు ఎస్.ఐ రాజనాల ధర్మరాజుతో పాటు 10 ప్రత్యేక బృందాలు ఈ కేసుకు సంబంధించి ముమ్మరంగా విచారణ చేపట్టాయి.
నిందితుడు తిరుమలశెట్టి హరిబాబు (28) అలియాస్ మోహనరావును విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో కొబ్బరి తోట రింగ్ సెంటర్ సమీపంలో ఉన్న గణేష్ రెస్టారెంట్ బార్ స‌మీపంలో ఓ రేకుల షెడ్డు ఎదుట క‌నిపించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గుంటూరు జిల్లా నకరికల్లు మండలం ఉదయ నగర్ కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ శివారు నైనవరం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అదుపులోకి తీసుకుని విచారించ‌గా… అతని ఇద్దరు బంధువులు రాపూరు మహేష్, రాపూరు దుర్గారావు ఈ హత్య చేసేందుకు సహకరించారని తెలిపారు. సదరు నిందితులు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 23 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement