Tuesday, November 26, 2024

Deepavali Special Trains: ఏపీ ప్రయాణికులకు స్పెషల్

దీపావళికి సొంత ఊర్లకు వెళ్లే వారికి ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని స్టేషన్లలో ఆగుతాయి.
నవంబర్ 13, 20, 27 తేదీల్లో చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ మధ్య ప్రత్యేక రైలు (నెంబర్ 06073) నడుస్తుంది. ఈ రైలు రాత్రి 11.45కి చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరి, మర్నాడు సాయంత్రం 6.30కి భువనేశ్వర్‌ చేరుతుంది.ఈ నెల 14, 21, 28 తేదీల్లో భువనేశ్వర్‌-చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు (నెంబర్ 06074) నడుస్తుంది.

ఈ రైలు రాత్రి 9కి భువనేశ్వర్‌లో బయల్దేరి, మర్నాడు మధ్యాహ్నం 3కి చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది.ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ నెల 11, 18, 25 తేదీల్లో చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి స్పెషల్ సూపర్ ఫాస్ట్ (నెంబర్ 06071) నడుస్తుంది. ఈ రైలు చెన్నై సెంట్రల్‌లో రాత్రి 11.45కి బయల్దేరి, మూడో రోజు తెల్లవారుజామున గం.3.45కి సంత్రాగచ్చికి వెళ్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement