ఇటీవల వివాదస్పద వ్యాఖ్యాలు చేసిన మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై టిటిడి వేటు వేసింది. ఈ మేరకు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో నేడు పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం చైర్మన్ భూమన తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకపై నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద వున్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయనున్నారు. రూ.4కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బోట్టులు తయ్యారి.. నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయింపు.. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది.. ఇదే సమయంలో అటవీ కార్మికుల జీతాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు చెల్లించాలనే నిర్ణయానికి వచ్చారు. రూ.3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అలిపిరిలో వున్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకోగా.. విరాళంగా రూ.1.8 కోట్లు ఇచ్చేందుకు సముఖుత వ్యక్తం చేశారు శేఖర్ రెడ్డి.. ఇక, 15 పోటు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.
రూ.3.19 కోట్లతో సప్తగిరి అతిధిగృహం ఆధునీకరణ.. రూ.3.15 కోట్లతో తిరుమలలోని జలాశయాల్లో ఉన్న మోటార్ పంపులు మార్పు.. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి ఉత్సవవరులుకు నూతన బంగారు కవచాలు.. 15 లక్షలతో వాహన తండ్లకు బంగారు తాపడం.. అలిపిరి నడకమార్గంలోని ముగ్గుబావిని తాగునీటి అవసరాల కోసం ఆధునీకీకరణకు ఆమోదం తెలిపారు.
మరోవైపు.. జమ్మూలోని టీటీడీ సిబ్బందికి హెచ్ఆర్ఏ పెంచాలని నిర్ణయించారు.. తిరుపతిలోని హరేరామ హరేకృష్ణా రోడ్డులో రూ.7.5 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం.. రూ.3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత బుక్ లు ప్రింటింగ్.. స్విమ్స్ లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు.. టీటీడీలోని ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాయితీపై భోజన సదుపాయం.. 8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం.. అన్నదానంలో 3 కోట్లతో వస్తువులు కొనుగోలు చేయాలని పాలక మండలి నిర్ణయించింది.. ఇక, సూపెర్వైజర్ పోస్టులతో పాటు క్రింద స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.. కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం అందించనుంది.. కళ్యాణం నిర్వహణకు ఆమోదం తెలిపింది.. టీటీడీలోని క్రింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుఒంది.. టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9 వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచాలని పాలకమండలి నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.