దిల్లీ: వైసీపీ సోషల్ మీడియా పూర్వ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విజ్ఞప్తులు ఏవైనా హైకోర్టు ముందే చెప్పుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్ఐ ఆర్ లు కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిరాకరించింది.
- Advertisement -