అమరావతి, ఆంధ్రప్రభ: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీసెట్- 2022) కౌన్సెలింగ్ ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతుందని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద రెడ్డి తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కామన్ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఏపీడీసెట్‌ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్, సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. 19వ తేదీ నుంచి అభ్యర్థులు అలాట్‌మెంట్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ డైట్ కళాశాలల్లో ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. అనంతరం ఈ నెల 31 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని డీజీఈ దేవానంద రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.