Tuesday, November 26, 2024

AP: వికేంద్రీకరణే మా విధానం.. గ్రామం నుంచి రాజధానుల దాకా అదే నినాదం: సీఎం జగన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: పాలనా వికేంద్రీకరణే మా విధానం.. గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు అదే నినాదం.. ప్రజలకు అందుబాటులో సుపరిపాలన అందించే లక్ష్యంతోనే కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యే కార్యాలయాలతోపాటు వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.. పాలనలో డీసెంట్రలైజేషన్‌ అంటే ఇదే.. ప్రజలకు మంచి చేసేది కనుక..అదే సరైన విధానం… కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతిభద్రతలు, పారదర్శకత లభించాలని మనసారా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వర్చువల్‌గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. రవాణా, ఐ అండ్‌ పీఆర్‌ శాఖమంత్రి పేర్ని వెంకట్రామ(నాని), ప్రభుత్వ సలహాదారు( ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్‌, వ్యవసాయశాఖస్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్‌, ఆర్‌ అండ్‌ బి ముఖ్యకార్యదర్శి ఏం టీ కృష్ణబాబు, ప్లానింగ్‌ సెక్రటరీ విజయ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ఇది శుభదినం.. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని గ్రామస్ధాయి నుంచి చూశాం.. జిల్లా స్ధాయిలో కూడా ఆ వికేంద్రీకరణ జరగడంతో ప్రజల ముంగిటకే పారదర్శక పాలన ప్రారంభమైంది. ఇకపై 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపుమారిందన్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి ఇవి 13 జిల్లాలకు సంబంధించిన కొత్త పేర్లు. ఇవి కొత్తగా ఏర్పాటు- చేసినవి..పాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం ఈ రెండింటితో పాటు- స్వాతంత్య్ర సమరాన్ని.. గిరిజన అక్కచెల్లెమ్మలు.. అన్నదమ్ముల సెంటిమెంట్‌ను, సేవాభావంలో ఆకాశమంత ఎదిగిన మహావాగ్గేయ కారులను, ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల ఏర్పాటు- వాటి పేర్లు నిర్ణయించామని తెలిపారు. గతంలో ఉన్న జిల్లాల పేర్లు యథాతథంగా ఉంటాయని, భీమవరం, రాజమహేంద్రవరం ఇవి గత జిల్లాలకు ముఖ్యపట్టణాలుగా మారాయన్నారు.. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలు ఈ రోజు నుంచి కొలువుదీరుతున్నాయి.

1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పడితే, 1979 జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పడ్డాయి. ఈ రెండే గత 70 యేళ్ల చరిత్రలో మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త జిల్లాలు. ఫలితంగా పరిపాలనా సంస్కరణలు, వికేంద్రీకరణ విషయంలో బాగా వెనుకబడిన రాష్ట్రంగానే మిగిలిపోవాల్సి వచ్చిందన్నారు. దేశం మొత్తంగా 28 రాష్ట్రాల్రు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఒక దేశ రాజధాని ప్రాంతంగా ఉన్న మన భారతదేశంలో… మొత్తం 727 జిల్లాలు ఉన్నాయి. యూపీలో అత్యధికంగా 75 జిల్లాలు అయితే అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 727 జిల్లాల్లో, దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమైన ఏపీలో మాత్రం నిన్నటివరకు 13 జిల్లాలతోనే ఉన్నాం. అతి చిన్న రాష్ట్రాల్ల్రో ఒక-టైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో చూస్తే.. 1.38 కోట్ల జనాభాకు ఏకంగా 25 జిల్లాలు ఉన్నాయని గుర్తుచేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్కో రాష్ట్రంలో జిల్లాకు సగటు-న ఎంత జనాభా ఉన్నారన్నది పరిశీలిస్తే 13 జిల్లాలలో 4 కోట్ల 90 లక్షలు అంటే జిల్లాకు 38 లక్షల 15 వేల మంది జిల్లాల సగటు- జనాభా ఉన్నారని దేశంలో ఏ రాష్ట్రంలోని జిల్లాకు సగటు-న ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేదన్నారు. మిగిలిన రాష్ట్రాల్రతో ఈ సగటు-ను పోలిస్తే మహారాష్ట్రలో సగటు-న ఒక్కో జిల్లాలో 31 లక్షలు , తెలంగాణాలో 10 లక్షల 60 వేల మంది సగటు-న జిల్లాకు ఉన్నారు. కారణం అక్కడ కొత్తగా 33 జిల్లాలు చేశారు. ఉత్తరాఖండ్‌లో కేవలం 6 లక్షలు మందికి… మిజోరంలో లక్షమందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53వేల మందికి ఒక జిల్లా ఏర్పాటు చేశారని విశ్లేషించారు.

కర్ణాటకలో 20 లక్షలు, యూపీలో 26.64 లక్షల మందితో ఒక జిల్లాగా ఏర్పడ్డాయి. 26 జిల్లాలతో 19 లక్షల 7వేల మందితో సగటు-న జిల్లా కింద ఏర్పడి రూపురేఖలు మారుతున్నాయని వివరించారు. గిరిజన జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలకు 6 నుంచి 8 అసెంబ్లీ స్ధానాలతో ఒక జిల్లా రూపొందించడం జరిగింది. 18 నుంచి 23 లక్షల మధ్య జనాభా ఉండేలా పునర్‌వ్యవస్ధీకరణ చేశామని చెప్పారు. మారుతున్న ప్రపంచంతో పాటు- ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు ప్రభుత్వాల విధానాల్లో కూడా మార్పులు అనివార్యమన్నారు. ఇప్పటికే పాలనా యంత్రాంగం గడపగడపకు సేవలందిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 104, 108 వాహనాలు కీలక భూమిక వహిస్తున్నాయన్నారు. అక్కచెల్లెమ్మల భద్రత విషయంలో ఎప్పుడూ, ఎక్కడా కూడా జరగని విధంగా.. దాదాపుగా 1 కోటి 19 లక్షల దిశా యాప్‌ డౌన్లోడ్స్‌ కూడా అక్కచెల్లెమ్మల ఫోన్లలో అందుబాటు-లో ఉంది. ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా… లేదా వారు ఏదైనా ఆపదలో ఉండి ఒక ఐదుసార్లు గట్టిగా ఫోన్‌ షేక్‌ చేసినా కేవలం 10 నిమిషాల నుంచి 20 నిమిషాలలోపే ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు పోలీసు సోదరులు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోందన్నారు.

రేషన్‌ ఇంటింట డోర్‌ డెలివరీ చేస్తున్న ప్రప్రధమ ప్రభుత్వం తమదే అన్నారు. గ్రామ, వార్డు సచివాలాయాల వ్యవస్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీ-ర్‌, 15,004 సచివాలయాల ద్వారా విజయవంతంగా సేవలందిస్తున్నారని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో రైతులకు అండగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. పాలనలో ఓ తాత్విక మార్పునకు నాంది పలికామన్నారు. స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి మనకు ప్రభుత్వ రంగంలో 11 మెడికల్‌ టీ-చింగ్‌ ఆసుపత్రులు ఉంటే.. ఈ రోజు మరో 16 యుద్ధప్రాతిపదికన నిర్మించే ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. లంచాలు, వివక్షకు తావులేకుండా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలన్నీ అర్హులందరికీ డీబీటీ- ప్రాతిపదికన అందుతున్నాయని ఇదో చారిత్రాత్మక మార్పు అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు- చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చామన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు-తో జిల్లా కలెక్టరేట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయాలు, మిగిలిన కేంద్రాలు అన్ని ఒకేచోటకి వస్తాయి.. కనీసం 15 ఎకరాల విస్తీర్ణంలో అన్నీ ఒకేచోట ఏర్పాటు- కాబోతున్నాయి.. వీటిని ఇంటిగ్రే-టె-డ్‌గా ఏర్పాటు- చేస్తే… అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు కావటం వల్ల ప్రజలకు మరింత సౌలభ్యంగా ఉంటుందన్నారు.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా స్ధానిక ప్రజల విజ్ఞప్తుల మేరకు జిల్లాల్లో కూడా మార్పులు, చేర్పులు చేశామన్నారు. తొలుత నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాలు ఏర్పాటు- చేశాం.. ఇందులో కూడా 12 నియోజకవర్గాల్లో మండలాలను కొద్దిగా విభజించి కొన్ని మండలాలను ఒక జిల్లాలోనూ, కొన్ని మండలాలను మరొక జిల్లాల్లోనూ ప్రజల ఆకాంక్షల మేరకు చేయాల్సి వచ్చిందిన్నారు. అదే విధంగా కుప్పం స్ధానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, అప్పడు రెవెన్యూ డివిజన్‌ కూడా ఏర్పాటు- చేసుకోలేక పోగా..ఇప్పుడు ఆయనే.. ఆక్కడే రెవెన్యూ డివిజన్‌ కావాలని విజ్ఞప్తి చేసిన మేరకు, ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని అక్కడ కూడా ఒక రెవెన్యూ డివిజన్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

దైవ సంకల్పం, ప్రజల ఆశీస్సులతో కొత్త జిల్లాల నుంచి పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. ఈసందర్భంగా కొత్తగా ఏర్పా-టైన 13 జిల్లాల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, కొత్త కార్యాలయాలు ద్వారా సేవలందించేందుకు కొత్త జిల్లాలకు చేరుకుని విధులకు హాజరైన అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉద్యోగుల కు ముఖ్యమంత్రి అభినందనలు తెలి పారు. కొత్త జిల్లాల ఏర్పాటు- తర్వాత ప్రణాళికశాఖ రూపొందించిన జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన డిస్ట్రిక్ట్ర్‌ హేండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ను ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement