Friday, November 22, 2024

ఏపీ ప్ర‌భుత్వానికి అప్పులు పెరిగాయి : ఉండ‌వ‌ల్లి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పెరిగాయ‌ని, వాటిపై నియంత్రణ లోపించిందని, అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకోనే మార్గాలను అన్వేషించాలని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ హితవు పలికారు. ఏపీ రాజకీయాలపై తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు.

రాష్ట్రానికి 6 లక్షల 22 కోట్ల రూపాయలకు అప్పులు పెరిగాయన్నారు. గడిచిన రెండేళ్లలోనే వైసీపీ ప్రభుత్వం 3 లక్షలకు పైబడి అప్పులు చేసిందని ఆరోపించారు. సీఎం జగన్‌ ప్రభుత్వ పాలనలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement