Saturday, November 23, 2024

ఏపీలో రుణభారం భారీ లోటు.. కష్టాల్లో ఖజానా, ఏజీ కార్యాలయం లెక్కలు విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై ఏడాదికేడాది రుణ భారం పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలల ఆర్థిక గణాంకాలు అధ్యయ నం చేస్తే రాష్ట్ర ఖజానా కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏజీ కార్యాలయం అక్టోబర్‌ వరకు ఆర్ధిక పరిస్థితిపై విడుదల చేసిన లెక్కల మేరకు భారీగా లోటు ఉన్నట్లు తేలింది. రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి అందిన సమాచారం మేరకే ఈ లెక్కలు విడుదల చేయగా.. ఆదాయ, వ్యయాలు సమానంగా ఉన్నట్లు నివేదికలో చూపించడం గమనార్హం. అక్టోబర్‌ వరకు 1,37,368 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు పేర్కొనగా.. ఖర్చును కూడా అంతే మొత్తంగా చూపించడం జరిగింది.. ఆదా యంలో పన్నుల రూపేణా రూ.60,814 కోట్లు రాగా.. పన్నేతర ఆదాయం రూ. 2,287 కోట్లు వచ్చింది. కేంద్రం నుంచి గ్రాంట్లు- రూపేణా రూ.20,809 కోట్లు వచ్చింది. వ్యయానికి సంబంధించి రూ.1,37,368 కోట్లు వచ్చినట్లు చూపించగా.. అందులో రెవెన్యూ వ్యయమే రూ.1,29,981కోట్లుగా గుర్తించారు. పెట్టుబడి వ్యయంగా రూ.5,876 కోట్లు పేర్కొన్నారు.

ఆదాయ, వ్యయాలను సమానంగానే చూపించినప్పటికీ లోటు మాత్రం భారీగా నమోదు అయింది. ఏడు నెలల్లో రెవెన్యూ లోటు రూ.46,071 కోట్లు రికార్డయ్యింది. ఇతర వ్యయం కోసం రూ.53,441 కోట్లు రుణంగా తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇదే మొత్తా న్ని ద్రవ్యలోటుగా కూడా నమోదు చేశారు. ఏపీలో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ రుణం రూ.3.98లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. అదే 2017-18లో గతంతో పోలిస్తే 9.8శాతం అప్పులు తగ్గాయని కేంద్రం పేర్కొంది. 2020-21 నాటికి అప్పులు 17.1శాతం పెరుగుదల నమోదైనట్టు తెలిపింది. ఏపీ జీడీపీలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్టు వెల్లడించింది. 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3శాతంగా ఉన్నట్టు పేర్కొన్న కేంద్ర ఆర్థికశాఖ.. 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని తెలిపింది.

- Advertisement -

2015లో రాష్ట్ర జీడీపీలో 23.3శాతం అప్పులు ఉండగా.. 2021 నాటికి అది 36.5శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. కాగా ఏడు నెలల కాలంలో రూ.53,441 కోట్లను రుణంగా తీసుకున్నట్లు ఏజీ కార్యాలయం వెల్లడించింది. ఇందులో పబ్లిక్‌ రుణాల ద్వారా రూ.40,245 కోట్లు సేకరించగా.. ఇతర రుణాల ద్వారా మిగిలిన నగదు సేకరించినట్లు నివేదికగా తేల్చారు. ఈ ఏడాదికి మొత్తర రుణ పరిమితి రూ.48 వేల కోట్ల వరకు ఖరారు చేయగా, ఏడు నెలల కాలంలోనే రూ.53 వేల కోట్లు దాటిపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement