Saturday, November 23, 2024

దశాబ్దాల కొఠియా సమస్యపై రెండు రాష్ట్రాల సీఎంల చర్చ‌.. పరిష్కారం లభించేనా

సాలూరు రూరల్‌, (ప్రభ న్యూస్‌) : కొఠియా గ్రామాల్లో గత నాలుగు నెలలుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒడిశా అధికారులు, పాలకులు విచక్షణను కోల్పోతూ తోటి అధికారులు, పాలకులేనన్న భావనను విస్మరించి ప్రవర్తిస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసులు కొఠియా గ్రూప్‌ గ్రామాల్లోని ప్రధాన గ్రామాలను రౌండప్‌ చేస్తూ గిరిజనులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒడిశా అధికారుల తీరుతో 21 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా అధికారులు ఏ యాక్ష‌న్ తీసుకోవ‌డం లేదు. తమకు అనుకూలంగా ఉండే ప్రజలతో మాట్లాడుతూ మీ వెనుక మేమున్నామంటూ పరోక్షంగా మద్దతు తెలుపుతూ ఒడిశా అధికారులను ఎదిరించండి, భయపడకండి అన్న మాటలు తప్ప చేసిందేమి లేదు.. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఒడిశా రాష్ట్ర పర్యటన ఆయా గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 9న ఒడిశా రాష్ట్రంలో పర్యటించి ఆ రాష్ట్ర నవీన్‌ పట్నాయక్‌ని ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కలవనున్నట్లు తెలియడంతో కొఠియా గ్రామాలకు చెందిన వేలాది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల కలయికలతోనైనా తమ ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉభయ రాష్ట్రాల మధ్య గత కొన్నేళ్లుగా పెండింగులో ఉన్న సమస్యలపై చర్చిస్తారని, ముఖ్యంగా జల వివాదంపై వీరి చర్చ సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సదరు ఆదేశాల ప్రకారం రెండు రాష్ట్రాల వారు ప్రస్తుతాని కి సమాన హక్కులు కలిగి ఉంటారు. అదేవిధంగా ఆయా గ్రామాల అభివృద్ధి, ఇతర అంశాల నిమిత్తం రెండు రాష్ట్రాల పాలకులు, అధికారులు స్వేచ్ఛగా ఆయా గ్రామాల్లో పర్యటించవచ్చు. ఫలితంగా ఆ రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలు తరచూ వస్తూ ఆంధ్రా అధికారులు ఇటుగా రాకూడదంటూ ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు విధించిన స్టేట్‌స్కో ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. ఫలితంగా గిరిజనులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరంగా నిత్యం అదే విద్య, వైద్యం, ఉపాధితో పాటు నిరుపేదలకు నెల వారి భృతి నిమిత్తం ఇచ్చే పింఛన్‌ తదితర వాటిని అడ్డుకుంటున్నారు. దీనితో కోర్టు ఇచ్చిన స్టేట్‌స్కోక్‌ అర్ధం లేకుండా పోయింది.

అయితే కొఠియా గ్రామాల్లో ఒడిశా అధికారుల కారణంగా జరుగుతున్న వరుస సంఘటనల మేరకు స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గత జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌కి ఏడాది జూలై 14న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసారు. అలాగే ఆగస్టు 24న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలసి కొఠియా గ్రామాల్లో ఒడిశా అధికారుల కారణంగా నెలకొన్న పరిస్థితులను వివరించగా, దానికి స్పందించిన సీఎం వెంటనే రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీతో మాట్లాడి ఫైల్‌ తయారు చెయ్యాలని కోరారు. అయితే నాటి కలెక్టర్‌ బదిలీపై వెళ్లగా, చీఫ్‌ సెక్రటరీ పదవీ విరమణ పొందారు. ఏదిఏమైనా ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒడిశా రాష్ట్రంలో పర్యటించేందుకు నిర్ణయించడంతో కొఠియా గ్రామాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

ఇది కూడ చ‌దవండి: ఆర్టీసీ బ‌స్సు చార్జీల పెంపునకు రంగం సిద్ధం

Advertisement

తాజా వార్తలు

Advertisement