భోగాపురం, డిసెంబర్ 2, ఆంధ్రప్రభ : మండల పరిధిలో గల పోలిపల్లి గ్రామం వద్ద కరెంట్ షాక్ తో కోనాడ ఎల్లాజీ (30) దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే స్థానికులు, పోలీసులు అందించిన ప్రకారం.. పోలిపల్లి గ్రామానికి చెందిన ఎల్లాజీ అనే వ్యక్తి ఉదయం 6:30 గంటలకు పూజా వ్యర్ధాలను చెరువులో నిమర్జనం నిమిత్తం వెళ్లి చెరువు వద్ద తెగిపడి ఉన్న లో టెన్షన్ విద్యుత్ తీగను తాకి అక్కడికక్కడే మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న నెల్లిమర్ల టీడీపీ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఎస్సై సూర్యకళ, విద్యుత్ శాఖ ఏఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలను నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.