Wednesday, January 1, 2025

Kakinada | అలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత.. విచార‌ణ‌కు ఆదేశించిన డిప్యూటీ సీఎం !

కాకినాడ తీరంలో ఇలీవల కాలంలో అలివ్ రిడ్లే తాబేళ్లు మరణిస్తుండటంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని… తాబేళ్లు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకొని, కారకులపై చర్యలు తీసుకోవాల‌ని అటవీశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. వన్యప్రాణుల పరిరక్షణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు.

- Advertisement -

వేల కిలోమీటర్లు ప్రయాణించి !

అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కాపాడేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లలో ఏడు జాతులు ఉన్నాయి. వీటిలో 5 రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి.

రెండు అడుగుల వెడల్పు, 50 కిలోల వరకు బరువు పెరిగే ఈ తాబేలు… ఎక్కడైతే గుడ్డు నుంచి పిల్లగా బయటకు వస్తుందో.. తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెట్టడం ఈ జాతి ప్రత్యేకత. ఇదిలా ఉండగా, ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు దాదాపు 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్ర తీరానికి చేరుకుంటాయి.

మన దేశంలోని ఒడిశా తీరంలో ఈ జాతికి చెందిన తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే ! కాగా, మన రాష్ట్రంలో కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలండ ప్రాంతం వరకు ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి.

అయితే గుడ్లు పొదిగేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి తీర ప్రాంతాలకు చేరుకునే ఈ తాబేళ్లు… మత్స్యకారులు చేపల వేటకు ఉపయోగించే పడవలు, వలలకు తగిలి మృత్యువాత పడుతున్నాయి. దీంతో తాబేళ్లను పరిరక్షనకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement