Friday, November 22, 2024

వేతన బిల్లులకు పదో తేదీ వరకు గడువు పొడగించాలి.. నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి..

అమరావతి, ఆంధ్రప్రభ: వేతన బిల్లులు పెట్టు-కోవడానికి మార్చి 10 వరకు సమయాన్ని పొడిగించాలని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20న పీఆర్సీ ఉత్తర్వులు వచ్చాయని, 25వ తేదీలోగా వేతన బిల్లులు పెట్టుకోవాలని ఫైనాన్స్‌ విభాగం సూచించిందని తెలిపారు. 5రోజుల వ్యవధిలో జనవరి జీతాలు అనామతు ఖాతా నుంచి చెల్లింపు జరగడం వల్ల ఉద్యోగుల జనవరి బిల్లు రూపొందించి అనామతు ఖాతాకు సంబంధించిన హెడ్‌కు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, అయితే ఆ హెడ్‌ను ఇంతవరకు తెలపలేదని అన్నారు. తదనంతరం ఎంప్లాయ్‌ అప్డేషన్‌ చేయాల్సి ఉందన్నారు.

ఐదు రోజుల్లో ఇదంతా పూర్తి చేయడం కష్టతరమైనది కాబట్టి మార్చి 10 వరకు సమయాన్ని పొడిగించాలని కోరారు. ఉద్యోగి వ్యక్తిగత వివరాలు సరిచేయడానికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడం వల్ల, ఫ్రీజింగ్‌ చేయడం వల్ల సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కనుక ఫ్రీజింగ్‌ తీసివేసి, ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగుల అప్డేషన్‌కు పాన్‌ కార్డు మ్యాండేటరీ నిబంధనను తొలగించాలని విన్నవించారు. ఫిబ్రవరి జీతాల బిల్లులు ఆలస్యమైన వారికి సప్లిమెంట్‌ బిల్లును మార్చిలో అనుమతించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement