నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని చెరువులో పురిటి బిడ్డ మృతదేహం లభ్యమైంది. ఉదయం చెరువు వద్దకు వెళ్లిన స్థానికులకు మృతదేహం కనపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత బిడ్డ మృతి చెందడంతో ఆ బిడ్డను ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -
ఉదయగిరి ప్రాంతంలోని ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. మృతిచెందిన పురిటి బిడ్డ మృతదేహాన్ని పడేశారా.. లేక బతికుండగానే పడేసారా.. అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పురిటిబిడ్డ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.