వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ కారులో మృతదేహం కలకలం రేపుతోంది. ఈ డెడ్‌బాడీ ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యందిగా గుర్తించారు. నిన్న ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ తనతో పాటు డ్రైవర్‌ను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఉదయ్ సమాచారమిచ్చారు. ఇవ్వాల (శుక్రవారం) తెల్లవారుజామున 2గంటలకు తన కారులోనే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.
అనంతరం వేరే కారులో ఎమ్మెల్సీ వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదేళ్లుగా ఎమ్మెల్సీ వద్ద సుబ్రహ్మణ్యం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్రైవర్‌ను హత్య చేశారంటూ ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇది యాక్సిడెంటా.. లేక డ్రైవర్‌ని చంపేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.