Wednesday, November 20, 2024

DDR Scam – ఆధ్యాత్మిక నగరిలోనూ వైసిపి అక్రమాల దందా

తిరుపతి – కూటమి ప్రభుత్వం అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల ఏడుకొండల కింద తిరుపతి ఉన్న విషయం తెలిసిందే.

ఆధ్యాత్మిక నగరంగా పేరు తెచ్చుకున్న తిరుపతి నగరంలో జరిగిన అక్రమాలపై చంద్రబాబుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. తిరుపతిలో జరిగిన డీడీఆర్ బాండ్ల విక్రయాలు, వాటి అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

తిరుపతి నగరంలో అభివృద్ధి పేరుతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సీఐడీ రంగంలోకి దిగింది. తిరుపతి కార్పొరేషన్ లో తిరుపతి పట్టణ ప్రణాళికా విభాగంలో శనివారం సీఐడీ అధికారులు పలు పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలించారు.

మాస్టర్ ప్లాన్ పేరుతో గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున తిరుపతి నగరంలో అవినీతికి తెరలేపిన అధికారులు, వైసీపీ నాయకుల గురించి సమాచారం సేకరించడంలో సీఐడీ అధికారులు బిజీ అయిపోయారు.తిరుపతి నగర అభివృద్ధి పేరుతో అధికారులు దాదాపు రూ 2,500 కోట్ల డీడీఆర్ బాండ్లు జారీ చేశారు.

- Advertisement -

డీడీఆర్ బాండ్ల జారీ ముసుగులో జరిగిన అక్రమాలపై విచారం జరిపించాలని టీడీపీ నాయకుడు రవి నాయుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకుడు రవి నాయుడు ఫిర్యాదుతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి ఎమ్మెల్యే కూడా వైసీపీకి చెందిన వ్యక్తి ఉండటం, తిరుపతి ఎంపీ కూడా వైసీపీ నాయకుడే కావడంతో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

తిరుపతి కార్పొరేషన్ లో గత ఐదు సంవత్సరాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి నగరపాలక సంస్థకు ఎంత ఆదాయం వచ్చింది, నగరంలో ఇక్కడెక్కడ అభివృద్ధి పనులకు ఎన్ని వందల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశారు, వైసీపీ నాయకులు, అవినీతి అధికారులు ఎన్ని కోట్లు మింగేశారు అని సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద తిరుపతి కార్పొరేషన్ లో సీఐడీ అధికారులు సోదాలు మొదలు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. శ్రీవెంకటేశ్వర స్వామి సాక్షిగా శనివారం రోజే తిరుపతిలో సీఐడీ అదికారులు ఎంట్రీ ఇచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement