మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర శెట్టి కుమార్తె మనసాని నలిని సూక్ష్మ కళానైపుణ్యంతో ప్రపంచ రికార్డులో చోటు సంపాదించింది. పెన్సిల్ ముక్కలతో తెలుపు నలుపు రంగుల చెస్ కాయిన్ రూపాయి బిల్ల సైజు (28 యంయం 28 యంయం) లో గాజుతో చెస్ బోర్డు తయారు చేసింది. డిసిబి వరల్డ్ రికార్డు సంస్థకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోగ అతి సూక్ష్మంగా చెస్ బోర్డు తయారు చేసిన సూక్ష్మ కళాకారిణి మనసాని నలిని ప్రపంచంలో తొలి మహిళాగా భారత దేశం తరుపున రికార్డు సాధించింది. దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే బంధువులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..