Wednesday, January 22, 2025

Davos – భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ – లక్ష్మీమిత్తల్‌ ను కోరిన చంద్రబాబు

దావోస్‌ – భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్‌ మిత్తల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ లక్ష్మీమిత్తల్‌ ను ఎపి మంత్రి లోకేశ్‌ ఆహ్వానించారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

దావోస్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్‌ మిత్తల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ లక్ష్మీమిత్తల్‌తో ఏపీ సీఎం చంద్రబాబు , మంత్రులు నారా లోకేశ్ , టీజీ భరత్‌ నేడు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ,ప్రణాళికాబద్ధమైన 83.3 ఎంటీపీఏ సామర్థ్యం గల పోర్టు, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వ మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని లోకేశ్‌ వివరించారు.

- Advertisement -

భావనపాడు-మూలపేట ప్రాంతం తయారీ, ఆర్‌అండ్‌డీ, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి, పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని చెప్పారు. హెచ్‌పీసీఎల్‌-మిత్తల్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3,500 కోట్లతో భారత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు.

2 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఆర్సెలార్‌ స్టీల్‌ప్లాంట్‌కు నిరంతరాయంగా పునరుత్పాదక విద్యుత్‌: లక్ష్మీమిత్తల్‌

అనంతరం లక్ష్మీమిత్తల్‌ మాట్లాడుతూ ఆర్సెలార్ మిత్తల్‌, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్‌ ఏర్పాటు ప్రక్రియను ఏపీలో ప్రారంభించామని గుర్తుచేశారు.

అనకాపల్లి సమీపంలో 2 దశల్లో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను ఉపయోగించి 975 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్సెలార్ మిత్తల్‌ భారత్‌లో గ్రీన్‌కో గ్రూప్‌తో భాగస్వామ్యం ఉన్నట్లు వివరించారు.

ఈ ప్రాజెక్టు అనకాపల్లిలో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్‌కు నిరంతరాయ పునరుత్పాదక విద్యుత్‌ను సరఫరా చేస్తుందన్నారు. దీనివల్ల ఏటా కార్బన్ ఉద్గారాలను 1.5 మిలియన్ టన్నులు తగ్గించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

నెట్‌వర్కింగ్‌ డిన్నర్‌కు హాజరైన ఏపీ ప్రతినిధుల బృందం

దావోస్‌ కాంగ్రెస్‌ సెంటర్‌ ప్లీనరీ హాల్‌ లాబీలో నెట్‌ వర్కింగ్‌ డిన్నర్‌ జరిగింది. దీనికి ఏపీ ప్రతినిధుల బృందం హాజరైంది. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్రమంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌ పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై నెట్‌వర్కింగ్‌ డిన్నర్‌లో పారిశ్రామిక వేత్తలతో మంత్రులు, అధికారులు చర్చించారు. ఏర్పాటుకు పెట్టుబడులకు లోకేశ్‌ ఆహ్వానించారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రణాళికాబద్ధమైన 83.3 ఎంటీపీఏ సామర్థ్యం గల పోర్టు, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వ మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని లోకేశ్‌ వివరించారు. భావనపాడు-మూలపేట ప్రాంతం తయారీ, ఆర్‌అండ్‌డీ, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి, పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని చెప్పారు. హెచ్‌పీసీఎల్‌-మిత్తల్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3,500 కోట్లతో భారత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement