Thursday, January 23, 2025

Davos – చంద్ర‌బాబు, లోకేష్ ఫుల్​ బిజీ – దిగ్గ‌జ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు

ఏపీలో అవ‌కాశాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటెష‌న్
రెన్యువబుల్ ఎనర్జీపై ప్ర‌త్యేక ఫోక‌స్
ఏఐ వ‌ర్సిటీ ఏర్పాటుపై ఐటీ టాప్ ప్ర‌తినిధుల‌తో మాటా మంతి

దావోస్, ఆంధ్రప్రభ:
ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ బృందం దావోస్ పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ పలు కంపెనీల అధిపతులతో భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కోరుతున్నారు. కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్యా స్యుటికల్స్, వైద్య పరికరాల తయారీలో ఆర్ అండ్ డి హబ్ లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.

- Advertisement -

ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ ద్వారా స్థానిక తయారీదారులు యూరోపియన్ మార్కెట్‌కు కనెక్ట్ చేసేలా సహకారం అందించాలని కోరారు. ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ కీలకరంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా హామీ ఇచ్చారు.

2030 నాటికి 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు..

అంతకుముందు ఎన్విజన్ సీఈవో లీ జంగ్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్ 2030 నాటికి రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024 రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాల తయారీని కూడా ప్రోత్సహిస్తోందన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందన్నారు. సంబంధిత స్టార్టప్‌లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్‌ను అభివృద్ధి చేసేందుకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహించాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై ఎన్విజన్ సీఈవో లీ జంగ్ స్పందిస్తూ.. ఆంధప్రదేశ్ విజ్ఞప్తిపై డైరక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఏపీలో టైర్ల తయారీ యూనిట్ కోసం..

అలాగే.. అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్‌తో కూడా మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లోకేష్‌ వినతి చేశారు. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు, రాష్ట్ర నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామికశక్తిని తయారు చేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలసి పనిచేయాలన్నారు. కాగా , అపోలో టైర్స్, వ్రెడెస్టీన్ బ్రాండ్‌ల కింద 100కి పైగా దేశాల్లో అనేక రకాల టైర్ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నామని అపోలో టైర్స్ వైస్ చైర్మన్ తెలిపారు. $ 2.3 బిలియన్ల టర్నోవర్‌తో అపోలో టైర్స్ టాప్ 20 గ్లోబల్ టైర్ తయారీదారుల్లో ఒకటిగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ పేర్కొన్నారు. ఇక ఎపిలో ఏర్పాటు చేయ‌బోయే ఎఐ వ‌ర్శిటీపై చంద్ర‌బాబు, లోకేష్ లో వివిధ ఐటి సంస్థ‌ల టాప్ ఎగ్జిక్యూటీవ్ ల‌తో మంత‌నాలు జ‌రిపారు.. వారి సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను స్వీక‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement