Wednesday, January 22, 2025

Davos – పెట్టుబడుల వేటలో బ్రాండ్​ ఏపీ టీమ్​ – బిల్ గేట్స్‌తో చంద్ర‌బాబు భేటీ

ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో వరుస భేటీలు
గూగుల్​ క్లౌడ్​, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా అధిపతులతో చర్చలు
గ్రీన్​కోతో ఎంఓయూ కుదుర్చుకున్న ఏపీ బృందం
ప్రముఖ సంస్థల ప్రతినిధులతో లోకేష్​ సమావేశాలు

దావోస్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌: దావోస్‌ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో 3వ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. సీఎంతో భేటీ కానున్న వారిలో డీపీ వరల్డ్ గ్రూపు, యునీలీవర్, గూగుల్ క్లౌడ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులు ఉన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను ఆయా సంస్థల అధినేతలతో భేటీ అయి చంద్రబాబు వివరించనున్నారు.

పునరుత్పాదక విద్యుత్​పై ఫోకస్​..

- Advertisement -

మైక్రోసాఫ్ట్​ అధినేత బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ నేడు చంద్రబాబు చర్చలు జరుపుతారు. ఏపీకి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దావోస్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌కోతో ఎంవోయూ కుదుర్చుకోనుంది. తద్వారా ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ పై ఫోకస్ చేస్తారు. పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు.

ప్ర‌ముఖ సంస్థ‌ల‌తో లోకేష్ భేటీ..

మరోవైపు ఐటీ మంత్రి లోకేష్ సైతం రాష్ట్రానికి పెట్టుబడుల కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. రెండో రోజు పది కీలక సమావేశాల్లో పాల్గొని పెట్టుబడుల కోసం చర్చలు జరిపారు. ముఖ్యంగా ఏపీలో గ్రీన్ పాలసీపై ఫోకస్ చేశారు. ఐటీ సంస్థ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ప్రాన్సిన్ కట్సౌదాస్ తో, జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ ఛాసిస్ మాడ్యుల్స్ సంస్థ సీఈవో ఐకీ డోర్ఫ్, ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ సౌత్ ఈస్ట్ ఆసియా వైస్ చైర్ పర్సన్ (ఎక్స్ టర్నల్ ఎఫైర్స్) ఆండ్రియా గోంట్కోవికోవా సహా పలువురు ప్రముఖులతో లోకేష్ సమావేశమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement