తల్లిదండ్రులు చనిపోతే కొడుకులు అంత్యక్రియలు నిర్వహించడం సర్వ సాధారణం. అయితే కొడుకులే ఆ పని చేయాల్సిన అవసరం లేదని, కూతుళ్లు కూడా చేయొచ్చని చాటిచెప్పారు ఆ ఇద్దరు కూతుళ్లు. కన్న తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకున్నారు కూతుళ్లు. వివరాల్లోకి వెళ్లితే.. విశాఖలోని ఎంవిపి కాలనీలో సెక్టార్ 2 లో నివాసముంటున్న గణపతి మృతి చెందారు. అయితే, ఆయనకు కొడుకులు లేకపోవడంతో తండ్రి మృతదేహానికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు ఇద్దరమ్మాయిలు. కొడుకులు లేని లోటు తీర్చి ఆదర్శంగా నిలిచారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement