అంధ్రప్రభ స్మార్ట్, మదనపల్లి: ప్రియుడి మోజులో తండ్రినే అతి దారుణంగా కూతురు హత్య చేసిన ఘటన సభ్య సమాజాన్ని కలచి వేసిది. ఈ దారుణం మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి పట్టణంలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలీకమ్ కాలనీకి చెందిన జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి భార్య లత ఏడాదన్నర కిందట చనిపోయింది. అప్పటి నుంచి తన గారాల పట్టి హరిత (25) ను దొరస్వామి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఉన్నత చదువులు చదువుకున్న కూతురికి నెల రోజుల కిందట ఓ పెళ్లి సంబంధం కుదిర్చాడు. తన పేరున రెండు అంతస్తుల ఇంటిని సైతం కూతురు పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ నెలలో రిటైర్డ్ అయ్యే డబ్బుతో ఎలాగైనా వైభవంగా తన బిడ్డకు పెళ్లి గ చేయాలని నిర్ణయం తీసుకున్న ఈ మాస్టారు ఈరపు దొరస్వామి (62) కు ఇవే చివరి రోజులు అయ్యాయి.
కన్న కూతురి అతి క్రూరం
ప్రియుడుతో హాయిగా గడపాలని పగటి కలలు కన్న హరిత కంటికి రెప్పలా కాపాడుతున్న దైవ సమానుడైన కన్న తండ్రికి ఉన్న మద్యం అలవాటును అలుసుగా తీసుకొని బుధవారం రాత్రి చుట్టు పక్కల జనం నిద్రపోయాక కన్న తండ్రి అనే కనికరం కూడా లేకుండా అతి క్రూరంగా తలపై ఇనుప వస్తువుతో కొట్టి హత్య చేసింది. ఈ హత్య హరిత ఒకటే చేసిందా.. లేక ప్రియుడి హస్తం ఏమైనా ఉందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్చి ఉంది. పథకం ప్రకారం దొరస్వామిని దారుణంగా హత్య చేసినట్లు నేర స్థలంలో మృతదేహం పడి ఉన్న తీరును బట్టి తెలుస్తోంది. హత్య జరిగిన ప్రదేశానికి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వన్ టౌన్, తాలుకా సీఐలు వల్లిబసు , శేఖర్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.