మాజీ మంత్రి వైస్ వివేకాహత్య కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. వివేకా హత్య కేసులో నలుగురు నిందితులను ఇవాళ పులివెందుల కోర్టుకు హాజరు పరిచారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు తరలించారు. అనారోగ్య కారణాలతో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరుకాలేదు. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న ఐదుగురు నిందితుల అభియోగపత్రాలను సిబిఐ అధికారులకు పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ అందజేయనున్నారు.
ఇకపై వివేకా కేసు విచారణ పులివెందుల కోర్టు నుంచి కడప జిల్లా కోర్టు కుమార్చే అవకాశం ఉంది. హత్యకేసులో నిందితుడు దస్తగిరి పులివెందుల కోర్టు మెజిస్టేట్ ఇచ్చిన సిఆర్పీసి 306 వాగ్మూలంపై జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతోంది.