Friday, November 22, 2024

నేడు, రేపు దసరా ప్రయాణికులకు స్పెషల్‌ రైళ్లు, బస్సులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దసరా పర్వదినాన్ని కుుంబసభ్యులు, బంధు వులు, స్నేహుతల మధ్య సంబరంగా జరుపు కునేందుకు ఊరెళ్ళిన వారి కోసం రైల్వే, ఆర్టీసీలు ప్రత్యేక ఏర్పాట్లను చేశాయి. పండగ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ నెల 17,18 తేదీలలో పలు ప్రత్యేక రైళ్ళను నడుపుతు న్నట్లు ప్రక టించింది. మరో పక్క ఆర్టీసీ కూడా ప్రయాణికులను తిరిగి నగరానికి తీసుకు వచ్చేందుకు విస్తృత ఏర్పాట్లను చేసి నట్లు ప్రకటిం చింది. ఈ నెల 17, 18 తేదీలలో 12 ప్రత్యేక రైళ్ళను నడుపు తున్నామని ప్రకటించిన రైల్వే శాఖ వాటి వివరాలను తెలిపింది. సికింద్రాబాద్‌ – ఖాజీ పేట, ఖాజీపేట – భద్రాచలం, భద్రాచలం – ఖాజీ పేట, ఖాజీపేట – హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌నగహర్‌ – సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ – విజయవాడ, విజయవాడ – సికింద్రా బాద్‌, సికింద్రాబాద్‌ – నిజామాబాద్‌, నిజామాబాద్‌ – సికింద్రాబాద్‌, కాచిగూడ – కర్నూల్‌ సిటీ, కర్నూల్‌ సిటీ – కాచిగూడ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్లు వెల్లడించింది.

టీఎస్‌ఆర్‌టీసీ కూడా విస్తృత ఏర్పాట్లను చేసింది. పండుగకు ఊరెళ్ళిన వారిలో దాదాపు రెండున్నర కోట్ల మందిని కేవలం 10 రోజుల్లోనే గమ్యస్థానాలకు చేర్చినట్లు పేర్కొన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తిరిగి వారందరినీ సురక్షితంగా నగరానికి తీసుకు వచ్చేందు కు సిద్దంగా ఉన్నామని తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి వెళ్ళే వారి సౌకర్యార్థం పలు చోట్ల ఆర్టీసీ ఏర్పాట్లను చేసింది. అయితే గ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి నగరానికి బయలు దేరేందుకు సిద్దమవుతున్న తరు ణంలో ఆయా ప్రాంతాలకు పండగ ప్రత్యేక బస్సులను పంపించేందుకు ఆర్టీసీ సన్నద్దమైంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆర్టీసీ పండుగ ప్రత్యేక బస్సులలో అదనంగా 50 శాతం చార్జీల వసూలును ఎత్తి వేసిన నేపథ్యంలో ప్రయాణికుల నుంచి కూడా ఆధరణ కనిపించింది. ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయించే వారు కూడా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement