దర్శి – ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడిగుద్దుల వర్షం కురిపించారని ఎద్దేవా చేశారు టిడిపి అధినేత చంద్రబాబు. పింఛను రూ.2వేలకు పెంచింది టిడిపి ప్రభుత్వ హయాంలోనేనని చెప్పారు. ”మన మ్యానిఫెస్టో కళకళ.. జగన్‌ది విలవిల” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ, ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకని ప్రశ్నించారు.
”నేను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారు. బడ్జెట్లో 19 శాతం సంక్షేమానికి ఖర్చు చేశా. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 శాతం మాత్రమే ఇచ్చారు. అధికారంలోకి రాగానే జే బ్రాండ్ మద్యం నిషేధిస్తాం. నాణ్యమైన లిక్కర్‌ను తక్కువ ధరకు ఇస్తాం. జగన్ ఫొటో ఉన్న పాసు పుస్తకాలను చించిపారేయాలి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ప్రజల భూములను జగన్ తన దగ్గర పెట్టుకుంటారంట. భూమి రికార్డులను ప్రైవేట్ సంస్థకు ఇచ్చారు. మీ భూమి ఇప్పుడు సైకో జగన్ గుప్పిట్లో ఉంది. భూమి మీది.. పెత్తనం జలగది. సైకో అందరి మెడలకు ఉరితాడు వేశారు. జగన్ ఎప్పుడు లాగితే అప్పుడు మీ ప్రాణం పోతుంది. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత నాది” అని అన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్‌రెడ్డి చిన్నపిల్లాడని జగన్ చెబుతున్నారని.. అలా అయినప్పుడు పలకా బలపం ఇచ్చి స్కూలుకు పంపించాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
జగన్ నవ రత్నాలకు….
- ఇసుక మాఫియా
- జే బ్రాండ్ మద్యం
- భూ మాఫియా
- మైనింగ్ మాఫియా
- హత్యా రాజకీయాలు
- ప్రజల ఆస్తుల కబ్జా
- ఎర్ర చందనం, గంజాయి
- దాడులు, అక్రమ కేసులు
- శవ రాజకీయాలు