వచ్చే ఏడాది జనవరి ఐద నుంచి తిరుపతి స్థానికులకు దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం తిరుపతి స్థానికులు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు టోకెన్లు పొందేందుకు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా చూపించాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.