Monday, November 25, 2024

Danger bells – తుంగభద్ర జలాశయం కు భారీగా వరద నీరు

కర్నూలు, ఉమ్మడి జిల్లా బ్యూరో. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయంకు భారీగా వరద నీరు పోటెత్తుతుంది. శనివారం ఉదయం 8 గంటలకు తుంగభద్ర రిజర్వాయర్లో 105 టీఎంసీలకు నీటి నిల్వలకు గాను 65.110 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులకు గాను 1621.32 అడుగులకు చేరుకుంది. తుంగభద్ర ఎగువ భాగం నుంచి జలాశయం కు 1,07,198 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టుకు చేరుతుండడంతో ఏ క్షణమైన జలాశయం గేట్లు తెరిచి తుంగభద్ర నదిలోకి నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ క్రమంలో తుంగభద్ర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు ఉదయం హెచ్చరికలు జారీ చేశారు. రిజర్వాయర్‌కు వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా అవుట్‌ఫ్లోలు మారుతూ ఉంటాయి. కాబట్టి తుంగభద్ర నదికి సమీప గ్రామాలకు చెందిన ప్రభుత్వ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ముందస్తు చర్యలకు ఉపక్రమించాలని అభ్యర్థించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement