సీనియర్ పొలిటీషియన్, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళవారం గుండెపోటుకు గురయ్యారు. అయితే చాలా వేగంగా స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన డాక్టర్లు ఆయన గుండెలో స్టెంట్‌ను అమర్చారు. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత, దగ్గుబాటి తోడల్లుడు అయిన చంద్రబాబు హుటాహుటీన అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే స్టెంట్ అమర్చడంతో ఊపిరి పీల్చుకున్న దగ్గుబాటిని చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఆసుపత్రికి రావడంతో స్టెంట్ అమర్చామని, దగ్గుబాటికి ఇక ప్రమాదమేమీ లేదని చంద్రబాబుకు డాక్టర్లు తెలిపారు.