Thursday, November 21, 2024

AP : నడి సంద్రంలో బోటు దగ్దం..!

విశాఖ క్రైం, ప్రభ న్యూస్ః నడి సముద్రంలో మత్స్యకారులు అగ్ని ప్రమాదానికి గురైంది లేదనే చెప్పాలి.అయితే వారి అదృష్టం బాగా లేక ఒక్కోసారి అలల తీవ్రతకి బూట్లు తిరగబడి సముద్రంలో మునిగిపోతూ ఉండటం కనిపిస్తుంది. దీనికి భిన్నంగా అయితే చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు బోట్లు వేరే ప్రమాదాలకైతే గురికావు.అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారుల బోటు విశాఖ తీరానికి 45 నాటికల్ మైళ్ళ దూరం అంటే 30 కిలోమీటర్ల దూరంలో అగ్ని ప్రమాదానికి గురికావడం జరిగింది.
నిజంగా ఇది మత్స్యకారులు ఊహించని పరిణామమే.

సముద్రపు మధ్యలో ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తమ పరిస్థితి ఏంటి అనేది భయాందోళనకు గురయ్యారు.
వారి అదృష్టం బాగుంది విశాఖ నావెల్ కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమై వారిని రక్షించడంతో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా తాము ఆ ప్రమాదం నుంచి బయటపడతాం అని కూడా వాళ్ళు ఊహించి ఉండరు.

- Advertisement -

నడిసముద్రంలో ప్రమాదం..
ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. సముద్రం మధ్యలో బోటు పాడవడంతో జనరేటర్ రిపేర్ చేస్తుండగా సిలిండర్ పేలి ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ తొమ్మిది మంది మత్స్యకారులు వీరంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జగన్నాథ స్వామి బ్రిడ్జి వద్ద నివాసకులు. గత నెల 24న వీళ్ళు అక్కడి నుంచి చేపల వేటకు బయలుదేరారు.
అంతా సవ్యంగా సాగుతుందనుకున్నా సమయంలో ఊహించని విధంగా శుక్రవారం మధ్యాహ్నం వీరు బోటు విశాఖ తీరంలో ప్రమాదానికి గురయింది. ఆ సమయంలో సిలిండర్ పేలడం వల్ల భారీగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.అప్పటికే వారిలో చాలామందికి గాయాలయ్యాయి.ఇక తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం కోస్ట్ గార్డ్స్ తమ సమాచారాన్ని చేరవేశారు.
సమయానికి స్పందించిన వారు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద బాధితులను వెంటనే తీరానికి తీసుకొచ్చి ప్రధమ చికిత్స కోసం కేజీహెచ్ లో జాయిన్ చేశారు.

కోలుకుంటున్నా బాధితులు..
ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో కేజీహెచ్ బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్న మత్స్యకారులు కోలుకుంటున్నారు.
అటు వైద్య సిబ్బంది కూడా వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇటు జిల్లా యంత్రాంగం కూడా స్పందించి వారికి సరైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లును వచ్చేస్తుంది. అసలు ప్రాణాలతో తాము బ్రతికి ఉంటామో లేదో అనే పరిస్థితిలో ఉన్న తమకు కోస్ట్ గార్డ్ సిబ్బంది సమయానికి ఆదుకుని తమ ప్రాణాలను రక్షించిందని చెప్పారు.

ప్రాణాలతో ఉంటామనుకోలేదు..
ప్రాణాలతో ఉంటామనుకోలేదని అగ్ని ప్రమాదానికి గురైన మత్స్యకారులు పేర్కొంటున్నారు. నటి సముద్రంలో జరిగిన ప్రమాదం మరో వైపు ఎండ తీవ్రత, కాలిన గాయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ తాము తీరానికి చేరుకోగలమా లేదా అసలు ప్రాణాలతో ఉంటామా లేదా భయంతో విలవిల్లాడమని బాధితులు వెల్లడించారు. ఆ సమయంలో తాము కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం చేర వేయడం వల్ల వాళ్ల స్పందించి తమను కాపాడారని తామంతా మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. విశాఖ కేజీహెచ్ లో తమ అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో 5 మంది మత్స్యకారులకు తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. బోటు సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని సహాయం చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్. దీంతో మత్స్యకారులను ఆస్పత్రికి తరలించారు. బోటులో సిలిండర్ ఎలా పేలిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement