వాయుగుండం ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టిన తరుణంలో మరో తుపాన్ దూసుకొస్తోంది. అండమాన్ సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపానుగా మారితే దీనిని ‘జవాద్’గా నామకరణం చేయనున్నారు. ఈ తుపాను ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏపీ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం గణనీయంగా ఏపీ, ఒడిశాలపై ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: తిరుపతి పర్యటనకు ఏపీ సీఎం జగన్
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily