ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్న జవాద్ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 210 కి.మీ. దూరంలో, గోపాల్‌పుర్‌కు 320 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో జవాద్ తుపాను పయనిస్తోంది. రేపు మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఒడిశాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది.
JAWAD CYCLONE: దిశ మార్చుకున్న ‘జవాద్’.. విశాఖకు 210 కి.మీ దూరంలో తుపాను!
Advertisement
తాజా వార్తలు
Advertisement