Saturday, November 23, 2024

Cyclone – ఏపీ కోస్తాలో కడలి కల్లోలం…గజగజ వణకుతున్న తీరప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్ తీరంపై మైచాంగ్ పడగ విప్పింది. కడలి కోరలతో దూసుకువస్తోంది. ఇటు కుంభవృష్టి, మరో వైపు విపరీత చలిలో తీరప్రాంతం గజ గజలాడుతోంది. 100 కిలోమీటర్ల వేగంతో హోరు గాలి వీస్తుంటే, అలలు విరుచుకు పడుతున్నాయి. మూడు రోజుల ముందే అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరప్రాంతంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, – విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో జడివాన అల్లాడిస్తోంది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్​ని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెల్లవారుజామున 3.00 గంటల నుంచి భారీ వాన ప్రారంభమైంది. ఇక.. అటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులిచ్చింది. వాన దాటికి విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. మద్రాస్​ ఎయిర్​పోర్టులోనే విమానాలన్నీ నిలిచిపోయాయి.

కృష్ణాజిల్లాలో కల్లోలం
సోమవారం తెల్లవారుజాము నుంచే కృష్ణా జిల్లా వ్యాప్తంగాభారీ వర్షం కురుస్తుంది. తీరం వెంబడి గంటకు 55నుంచి -75కిలోమీటర్ల వేగంతో హోరు గాలి వీస్తోంది.కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెంలో మంగళవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్త మయ్యాయి, . సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అలల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. సముద్రం కొన్ని ప్రాంతాల్లో ముందుకు వచ్చింది . కృష్ణాజిల్లా తీర ప్రాంతంలోపది మీటర్ల ఎత్తున సముద్ర పు అలలు ఎగిసిపడుతున్నాయి. ,దివిసీమలో కోడూరు, నాగాయలంక మండలాల్లో నిఉంటగుణం, రామకృష్ణ పురం, పాలకాయతిప్ప, బసన్నపాలెం ,ఇరాలి, చింతకోళ్ళ ,ఎదురు మెండి, ఎల్లిచెట్లదిబ్బ ,సోర్లగోంది, నాలి ,సంగమేశ్వరం , కృత్తివెన్ను మండలం చినగోల్లపాలెం, మచిలీపట్నం మండలం పెదపట్నం, మంగినపూడి, పోలాటి తిప్ప,గ్రామాల్లో ని తీర ప్రాంత ప్రజలుబిక్కు బిక్కు మంటున్నారు. అధికారుల సమాచారంతో మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. జిల్లాలో 7 మండలాల్లోని 51 గ్రామాల్లో 57 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు. ఈ పునరావస కేంద్రాలకు 1,814 మందిని తరలించారు. మరో 7,763 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజా బాబు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారు.

బాపట్లలో భయం భయం
బాపట్ల జిల్లా బాపట్ల , రేపల్లె,చీరాలనిజాంపట్నం ప్రాంతాల్లో ఎస్టీఅర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.18 మంది ఎన్టీఆర్ఎఫ్ బృందాలు తీరప్రాంతానికి చేరుకున్నాయి. మరో 18 బృందాలు బాపట్లకు చేరుకుంటాయి. తీర ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ తుపాన్ పునరావాస కేంద్రాలకు రెవెన్యూ,పోలీస్ శాఖ అధికారులు తరలిస్తున్నారు. ప్రజలకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక సముద్రతీరం తుఫాన్ షెల్టర్లలో తీర ప్రాంత ప్రజలకు వసతి కల్పించారు.తుపాన్ ప్రభావంతో సముద్రంలో వేటనిషేధించి నల్లమడకాలవబోట్లు నిలిపివేశారు.

కాకినాడలో ఆరెంజ్ అలర్ట్
కాకినాడ జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పాడ వద్ధ సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు బీచ్ రోడ్డును తాకుతున్నాయి. సముద్రం లోపల అల్లకల్లోల పరిస్థితితో కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులను అధికారులు నిలిపివేశారు. దాదాపు పదికి పైగా విదేశీ నౌఖలు నిలిచిపోయాయి. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని, వేటకెళ్లిన వారిని తక్షణమే వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్‌ అధికారులను ఆదేశించారు . నెల్లూరు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌, పల్నాడు, శ్రీసత్యసాయి, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించగా, మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

తిరుపతిలో భారీ వర్షం .. ఓ చిన్నారి మృతి
పెను తుపాన్‌గా ఆవిర్భవించిన మైచాంగ్ ప్రభావంతో తిరుపతి జిల్లాలోని భారీ వర్షం కురుస్తోంది. పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తులు చలితో వణికిపోతున్నారు. ఏర్పాడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు యశ్వంత్ మరణించినట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గత శనివారం నుంచీ ఏకధాటిగా ఈ చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

విశాఖ నుంచి ఫ్లైట్ క్యాన్సిల్
మైచాంగ్ తుఫానుతో విశాఖపట్నంలో విమాన సర్వీసులను రద్దు చేశారు.. విజయవాడ నుంచి మంగళవారం ఉదయం 9.00 గంటలకు విశాఖకు చేర్చాల్సిన ఇండిగో సర్వీస్ ను రద్దు చేశారు. విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సిన సర్వీసును, చెన్నై నుంచి విశాఖకు చేరాల్సిన సర్వీసును, మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విశాఖ రావలసిన విమానం సర్వీసును రద్దు చేశారు.

తమిళనాడు గజగజ
మైచాంగ్ తుఫానుతో తమిళనాడు గజగజ వణుకుతోంది. వారం రోజుల కిందటే భారీ వర్షాలతో తల్లడిల్లింది. ప్రస్తుతం ఏపీలో కేంద్రీకృతమైన తుపాను ప్రభావాన్ని అంచనా వేసిన తమిళనాడు ప్రభుత్వం .. తమ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. పుదుచ్చేరీ కరైకల్ కలై సెల్వీ, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్, తిరువల్లూరు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు.

ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
మైచాంగ్ తుపాను ప్రభావంపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అప్రమత్తంగా వ్యవహరించాలని విశాఖ నుంచి నెల్లూరు జిల్లా వరకూ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల, కృష్ణా, ఏలూరు, భీమవరం, కాకినాడ జిల్లాల్లో పునరావాసం కోసం జిల్లాకు రూ.కోటి లు చొప్పున విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయటమే కాదు, బాధితులను తుపాను పునరవాస కేంద్రాలకు తరలించే ఏర్సాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సహాయక శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండిఆహారం,తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టండితుపానుతో దెబ్బతినే వ్యవస్థలను యుద్ధప్రాతిపదికనపునరుద్ధరించాలి . కల్లాల్లో ధాన్యం తడిసిపోకుండా ప్రత్యేక చర్యలు తేమలాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించాలి-కలెక్టర్లకు సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.’ధాన్యంలో తేమ శాతం పట్టించుకోవద్దు. ధాన్యం సేకరించి వెంటనే మిల్లుకు తరలించాలి. 7,20 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయాలి. సదరు జిల్లాల్లో డ్రయర్లు లేకుంటే పొరుగు జిల్లాలకు పంపాలి. అందుకయ్యే రవాణా ఖర్చులనూ భరించాలి’ అని స్పష్టం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement