తిరుపతి, (ప్రభ న్యూస్): తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు, మరోవైపు శెట్టిపల్లి మంగళం పేరూరు ఓటేరు సాయి నగర్ పంచాయతీలలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలను ముంచెత్తిన భారీ వర్షాం, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. స్థానిక ఎంపిడిఓ డాక్టర్ వెంకట నారాయణ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
అవసరమైతే తప్ప గ్రామీణ ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు . కొన్ని పంచాయతీలలో భారీ వర్షాలకు వృక్షాలు నేల కూలడంతో ద్విచక్ర వాహనాలు, ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి..
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily