అసని తుపాన్ మచిలీపట్నం, నర్సాపురం మధ్య తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఇది బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు. తుపాన్ తీరం దాటే టైమ్‌లో కోస్తాంధ్రలోని పలు జిల్లాలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు, వర్షం కురిసింది. ఈదురుగాలల తాకిడికి అరటి, కొబ్బరి తోటలకు భారీగా నష్టం వాటిల్లినట్టు ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది.
ఇక.. బంగాళాఖాతంలో పెద్ద ఎత్తున అలలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని చీరాల, ఇసుకపాలెం, కొత్తపట్నం ప్రాంతాల్లో అలల తాకిడి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంద. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం మండలం ఒజ్జిరెడ్డిపాలెం, రెడ్డిపాలెం సముద్ర తీరం వద్ద సముద్రంపై మబ్బులు కమ్మేసి.. సముద్రంతో కలిసిపోయినట్టు కనిపించిన దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఆకాశం తలవించి భూమిని ముద్దాడుతున్నట్టు ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.