Monday, September 16, 2024

Cyclone – పూరి తీరాన్ని తాకిన తుపాన్ … ఉత్త‌రాంధ్ర‌లో భారీ వ‌ర్షాలు

ఉత్త‌రాంధ్ర‌లో భారీ వ‌ర్షాలు
కోస్తాకు వాన గండం
అల్ల‌క‌ల్లోలంగా స‌ముద్రం
కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం,
కాకినాడ పోర్టుల్లో మూడో నంబరు హెచ్చరికలు

విశాఖ – బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ నేటి మ‌ధ్యాహ్నం ఒడిశాలో పూరి వ‌ద్ద తీరాన్ని తాకింది.. ఈ తీరం పూర్తిగా దాటేందుకు మూడు గంటలు పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్ర‌భావంతో ఒడిశాతో పాటు ఎపిలోని ఉత్త‌రాంద్ర‌, కోస్తా తీర ప్రాంతాలలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.. తీరం వెంబ‌డి 70 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి..

అల్ల‌క‌ల్లోలంగా స‌ముద్రం…

- Advertisement -

వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. గంటకు గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

ఎపి తెలంగాణ‌కు 48 గంట‌ల పాటు వ‌ర్షాలు

ఈ ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో నేటి నుంచి వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురియవచ్చని తెల్పింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఎపిలో హై అల‌ర్ట్ ..

మరోవైపు ఏపీలో నేడు, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అధికంగా ఉంటుందని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఇక‌ ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా అల్లూ రి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement