Saturday, November 23, 2024

Cyclone – కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం

విశాఖ – బంగళా ఖాతం లో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఆదివారం చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, వైఎస్‌ఆర్‌, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement