Friday, November 22, 2024

వద్దంటే వినలే.. ‘అసని’ తాకిడికి బోట్లు గల్లంతు, ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారులు (వీడియో)

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అసని తుపాను ప్రాణగండంలా మారింది.  6 పడవలపై వేటకు వెళ్లిన 60 మంది మత్స్యకారుల బృందం తుపానులో చిక్కుకుంది. ఒడిశా తీరంలో వీరు వెళ్లిన బోట్లు అలల తాకిడికి బోల్తాకొట్టాయి. గంజాంలో అలల కారణంగా ఒడిశా తీరంలో పడవలు బోల్తా పడటంతో 60 మంది మత్స్యకారులు తృటిలో తప్పించుకున్నారు. అసని తుపాను కారణంగా కోస్తాంధ్రలో అలలు, భారీ వర్షాలు కురుస్తాయని ముందే అంచనా వేశారు. ఈ విషయం తెలిసిన శాణార్యాపల్లి, బాడ ఆర్యపల్లి, గోలబండ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఆరు పడవల్లో పెద్ద ఎత్తున చేపలతో తీరానికి తిరిగి వస్తున్నారు. ఒక్కసారిగా సముద్రం అల్లకల్లోలంగా మారింది.

మంగళవారం గంజాంలోని ఛత్రాపూర్ సమీపంలోని ఆర్యపల్లి వద్ద సముద్రంలో అల్లకల్లోలంగా ఉన్న ఆరు పడవలు బోల్తా పడడంతో 60 మంది మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.  అయితే, కొన్ని పడవలు ఒడ్డుకు చేరువలో మునిగిపోవడంతో మత్స్యకారులంతా ఈదుకుంటూ తీరం చేరుకున్నారు. వారు తాము పట్టిన చేపలన్నిటినీ కోల్పోయారు. వారి పడవలలో ఒకటి పూర్తిగా దెబ్బతింది. కొంతమంది మత్స్యకారులకు స్వల్ప గాయాలయ్యాయి.కాగా, తుపాను సూచనలను ఉల్లంఘించిన మత్స్యకారులకు శిక్షార్హమైన చర్యలుంటాయని స్పెషల్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (SRO) కమిషనర్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లినట్లు గుర్తించారు. మత్స్యకారులు మే 12 వరకు సముద్రంలో చేపడితే వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని ఎస్‌ఆర్‌సీ ప్రదీప్ జెన్​ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తుఫాను మే 10వ తేదీ రాత్రి వరకు దాదాపు వాయువ్య దిశగా పయనించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీరానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ వీడియోను www.prabhanews.com లో చూడొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement