( ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖపట్నం బ్యూరో ) తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్, వాయువ్య బంగాళాఖాతంలో అ తీవ్రతుపానుగా రూపాంతరం చెందింది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో తుపాన్ కదులుతోంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉంది.
పూరీ-సాగర్ ద్వీపం మధ్య భీతార్కానికా, ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటనుంది. ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా)కి 520 కిమీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 600 కిమీ, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 610 కిమీ. దూరంలో ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి బుధవారం మధ్యాహ్నం నుంచి గంటకు 80- నుంచి 100కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రేపు రాత్రి నుంచి 100..-110కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రజలను అప్రమత్తం చేశారు.
భారీ వృక్షాలు, చెట్లు దగ్గర / కింద నిలబడవద్దు, కూర్చో వద్దు, ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి. కింద ఉండకండి.అన్నారు. వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండాలని, పాత భవనాలు, శిథిలావస్థలోని ఇళ్లలో ఉండవద్దన్నారు. రెంట్/ టెలిఫోన్ స్థంభాలకు, లైన్లకు హోర్డింగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు.
మూడు రోజులు రైళ్లు బంద్
దానా తుపాను హెచ్చరికల నేపథ్యంలో 23, 24, 25వ తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. వాటిలో దూర ప్రాంత సర్వీసులు సహా దగ్గర సర్వీసులూ ఉన్నాయి. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హౌరా, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, పూరీ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఉన్నాయి. విశాఖ – భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ రైలును 24న రద్దు చేశారు.
ఈ రోజు ఆగిన రైళ్లు
- రైలు నం. 22503 కన్నియాకుమారి- దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12514 సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
- రైలు నెం. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12840 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12868 పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 22826 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12897 పుదుచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 18464 కేఎస్ ఆర్ బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 11019 సీఎస్టీ ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12509 ఎస్ఎంవీ బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 18046 హైదరాబాద్- హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
- రైలు నెం. 12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 22888 ఎస్ఎంవీటీ బెంగళూరు- హౌరా హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12864 ఎస్ఎంవీటీ బెంగుళూరు- హౌరా SF ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 09059 సూరత్-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12552 కామాఖ్య- ఎస్ఎంవీ బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 22504 దిబ్రూఘర్- కన్నియాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 22973 గాంధీధామ్- పూరీ ఎక్స్‌ప్రెస్
రేపు నడవని రైళ్లు - రైలు నెం. 03429 సికింద్రాబాద్-మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
- రైలు నెం. 06087 తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
- రైలు నం.12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 22603 ఖరగ్‌పూర్-విల్లుపురం SF ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 18045 షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 22851 సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12841 షాలిమార్ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్
- రైలు నెం. 12663 హౌరా-తిరుచ్చిరాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12863 హౌరా- ఎస్ఎంవీటీ బెంగళూరు సూఫర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 18047 షాలిమార్-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12839 హౌరా- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెయిల్
- రైలు నం. 22644 పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 06090 సంత్రాగచ్చి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 18117 రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 08421 కటక్- గుణుపూర్ ప్యాసింజర్
- రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్
- రైలు నం. 07471 పలాస-విశాఖపట్నం ప్యాసింజర్
- రైలు నం. 20837 భువనేశ్వర్-జునాగర్ ఎక్స్‌ప్రెస్
- రైలు నెం. 18447 భువనేశ్వర్-జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 20842 విశాఖపట్నం-భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 22874 విశాఖపట్నం-దిఘా ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 18118 గుణుపూర్-రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 22820 విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 08532 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12842 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 22808 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి AC ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 15227 ఎస్ఎంటీవీ బెంగళూరు-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 20838 జునాగర్ రోడ్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 18448 జగదల్పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 06095 తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 12246 ఎస్ఎంవీ బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్
- రైలు నెం. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్
- రైలు నం. 07470 విశాఖపట్నం- పలాస మెము
- రైలు నం. 18526 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్
25న ఆగిన రైళ్ల వివరాలు - రైలు నెం. 09060 బ్రహ్మపూర్-సూరత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 22873 దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
- రైలు నెం. 22819 భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
- రైలు నెం. 08531 బ్రహ్మపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్
- రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేకం
- రైలు నం. 18525 బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 08422 గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 20807 విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్
- రైలు నం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్
- రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్
- రైలు నం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్