Tuesday, September 17, 2024

AP | సైబర్ నేరాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి : సీపీ రాజశేఖర్ బాబు

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ సీపీ రాజశేఖర్ బాబు అన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు.

సైబర్‌ నేరాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సైబర్‌ సిటిజన్‌ ​​యాప్‌పై అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిఆర్‌ జిల్లా పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ… సమాజంలో వివిధ రకాల సైబర్‌ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా 200 మంది సైబర్ కమాండోలను, 2000 మంది సైబర్ సోల్జర్స్ ను తీర్చి దిద్దామ‌ని, వారి ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైబర్ సిటిజెన్ యాప్ తయారుచేసి.. అందులో పలు రకరకాల మోసాలను, అవి ఏ రకంగా జరుగుతాయి అని తెలియజేసే విధానాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యాప్ ను రూపొందించిన్ట్లు చెప్పరు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 200 మంది సైబర్ కమాండోలు, 2000 మంది సైబర్ సైనికులకు శిక్షణ ఇచ్చి ప్రజలను చైతన్యం చేసేందుకు సైబర్ సిటిజన్ యాప్‌ను రూపొందించాం అని తెలిపారు. ఈ యాప్‌లో 16 రకాల నేరాలను పొందుపరిచి… నేరాల రకాలను తెలియజేసే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు చెప్పలేదు.

అయితే ఈ యాప్ లోని కంటెంట్ ప్రతి పౌరుడిని చేరుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి పౌరుడిని సైబర్ సిటిజన్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సైబర్ సిటిజన్ యాప్‌కు సంబంధించి, ప్రతి పట్టణంలో, గ్రామంలో, అన్ని పాఠశాలలు, కళాశాలలు, నివాస సముదాయాలలో, ప్రతి ఒక్కరికి సైబర్ పౌరులుగా తెలియజేసి శిక్షణ ఇవ్వాలని, తద్వారా వారు వివిధ మోసాల నుండి తమను తాము రక్షించుకునేలా తయారు చేయాలని కోరారు.

- Advertisement -

రానున్న మూడు నెలల్లో సుమారు 2 లక్షల మందికి అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా సామాజిక మాధ్యమాలు, ఇతర మాధ్యమాలను ఉపయోగించుకుని ముందుగా మన కుటుంబ సభ్యులను, బంధువులను సైబర్ సిటిజన్స్ గా తీర్చిదిద్ది…. వారి ద్వారా వారి ద్వారా మరికొందరిని ఈ అవగాహన కార్యక్రమం ద్వారా సైబర్ సిటిజన్స్ గా తీర్చి దిద్దాలని కోరారు.

కార్యక్రమం అనంతరం సైబర్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ కి సంబంధించిన వీడియో పోటీల్లోని విజేతలకు బహుమతులను ప్రధానం చేసారు. అనంతరం పోలీస్ కమీషనర్ ఈ కార్యక్రమము ను విజయవంతం చేయడానికి కృషి చేసిన డి.సి.పి.,గౌతమిశాలి, సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు ఇన్స్పెక్టర్లు గుణరామ్, పి.శ్రీను అభినధించారు.

ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు గౌతమిశాలి, ఏ.బి.టి.ఎస్. ఉదయరాణి, టి.హరికృష్ణ, చక్రవర్తి ,మహేశ్వరరాజు,సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు ఇన్స్పెక్టర్లు గుణరామ్, పి.శ్రీను, వాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు మూర్తి, రంభ, ధర్మరాజు, దుర్గామహేశ్వరరావు, ఇతర అధికారులు 200 మంది సైబర్ కమాండోలు, 2000 సైబర్ సోల్జర్స్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement