Tuesday, September 17, 2024

AP | గంటూరు జిల్లాలో సైనైడ్‌ మర్డర్స్‌ కలకలం..

ఉమ్మడి గుంటూరు, ప్రభ న్యూస్‌ బ్యూరో: ఒకే ఒక వ్యక్తి పది మందిని హత్య చేశాడు … గతంలో అదే సైనేడ్‌ శివ (అలియాస్‌ సింహాద్రి) ఏలూరులో… దేశవ్యాప్తంగా సంచలనమైన వార్త. ముగ్గురు మహిళలు – నలుగురి హత్య… తెనాలిలో సంచలనం రేపుతున్న తాజా సంఘటన. ఒకరు ఇద్దరూ కాదు ఏకంగా నలుగురిని ముగ్గురు అతివలు హత్య చేశారు.

మరో ముగ్గుర్ని చంపబోయారు. .సైనేడ్‌ తో క్షణాల్లోనే హత్య చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. పోలీసుల సమాచారం మేరకు తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ.. ఈ ఏడాది జూన్‌ నెలలో రజిని అనే మహిళ ఆటోను బాడిగకు మాట్లాడుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పింది. ఆటోలో రజినితోపాటు నాగూర్‌ బీ అనే మహిళ కూడా ఎక్కింది. వీరితోపాటు వెంకటేశ్వరి అలియాస్‌ బుజ్జి అనే మహిళ ఆటోను ఫాలో అవుతూ బైక్‌పై వచ్చింది.

మార్గమధ్యలో ఆటో డ్రైవర్‌ చేత రజిని బ్రీజర్‌ కొనిపించింది. రజిని, నాగూర్‌ బీ, వెంకటేశ్వరి వడ్లమూడి సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రజిని, వెంకటేశ్వరి తమతో వచ్చిన నాగూర్‌ బీ కి బ్రీజర్‌లో సైనేడ్‌ కలిపి ఇచ్చారు బీజర్‌ తాగిన వెంటనే చనిపోయింది. ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలును తీసుకుని ఇద్దరూ మహిళలు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

డొంక కదిలిందిలా..

నాగూర్‌ బీ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్‌ను విచారించగా రజిని అనే మహిళ ఆటోలో వచ్చినట్లు డ్రైవర్‌ చెప్పాడు. యడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజినిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారు ఆభరణాలు కోసం నాగూర్‌ బీ కి సైనేడ్‌ కలిపిన బ్రీజర్‌ త్రాగించినట్లు ఆ ఇద్దరూ మహిళలు ఒప్పుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా మరో ముగ్గరు మహిళలకు సైనేడ్‌ ఇచ్చి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నారు.

మద్యంలో సైనేడ్‌ కల్పి హత్య

2022 లో మార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మీని ఆమె ఆస్తి, డబ్బుల, బంగారు ఆభరణాలు కోసం ఇదే తరహాలో మద్యంలో సైనేడ్‌ కలిపి ఇచ్చి చంపారు. వెంకటేశ్వరికి సుబ్బలక్ష్మీ స్వయాన అత్త అవుతుంది. ఆ తర్వాత 2023లో నాగమ్మ అనే మహిళను థమ్స్‌అప్‌లో సైనేడ్‌ కలిపి హతమార్చారు.

- Advertisement -

ఆమె వద్ద తీసుకున్న 20,000 రూపాయల అప్పు ఎగ్గొట్టేందుకు చంపేశారు. తెనాలికి చెందిన పీసు అలియాస్‌ మోషే అనే వ్యక్తి తరుచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు అతని భార్యతో చేతులు కలిపి 2024లో మద్యంలో సైనేడ్‌ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే ఫెన్షన్‌, ఇన్సూరెన్స్‌ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్‌ కుదర్చుకున్నారు.

ఆహార పదార్థాలలో సైనైడ్‌

ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. వారికి ఆహారం, కూల్‌ డ్రింగ్‌, టీ లలో సైనేడ్‌ కలిపి ఇవ్వగా చివరి సమయంలో ప్లాన్స్‌ వర్కవుట్‌ అవ్వలేదు. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద నున్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనేడ్‌ కలిపి హత్యలు చేసినట్లు పోలీసుల విచాణలో వెల్లడైంది. ఈ హత్యలన్నింటింకి ముగ్గురు మహళలే కారణమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. వీరికి సైనేడ్‌ విక్రయిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు ఆయన చెప్పారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement