లేపాక్షి ప్రభ న్యూస్ : మండలం కంచిసముద్రం నుండి బయన్నపల్లి కి వేళ్లే ప్రధాన రహదారిపై నిర్మించిన కల్వర్టు గత సంవత్సరం 2020 ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు కూలిపోయింది. అప్పటి నుంచి దాదాపు పదుల సంఖ్యలో ప్రమాదవశాత్తు కల్వర్టు లో పడి కాళ్ళు, చేతులు విరిగి పలువురు ఆసుపత్రి పాలయ్యారు, వారిలో ఇద్దరు ప్రాణాలు సైతం కోల్పొయారు. ప్రస్తుత పాలకులు ఒక సమయంలో ఆ కల్వర్టు ను సందర్శించి చుట్టు ప్రక్క గ్రామ ప్రజలకు త్వరలోనే కల్వర్టు నిర్మాణం చేపడుతాం అని హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సర కాలం గడుస్తున్నా కల్వర్టు నిర్మాణం పని మాత్రం సాగలేదు అంటున్నారు కంచిసముద్రం గ్రామపంచాయతీ ప్రజలు. పాలకులను విమర్శిస్తూ పత్రిక ప్రకటనలకు మాత్రమే వారి వాగ్దానాలు ఉన్నాయి తప్ప ప్రజా పరిపాలన చేసి చూపడంలో విఫలం అవుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..