Sunday, September 22, 2024

Cuddapah – మూడు ఏటీఎం లలో దోపిడీ

కడప క్రైమ్, సెప్టెంబర్ 22 (ప్రభ న్యూస్ ): కడప జిల్లాలో దొంగల ముఠా హల్చల్ చేసింది. బ్యాంకు ఏటీఎంలే టార్గెట్ గా చోరీలకు పాల్పడింది. ఒకేరోజు మూడు ఏటీఎంలలో ఒకేసారి ఘటనలు జరగడంతో జిల్లా పోలీస్ యంత్రాంగంలో అలజడి నెలకొంది.

శనివారం అర్ధరాత్రి కడప నగరం తో పాటు ఒంటిమిట్టలోను ఏటీఎంల చోరీకి పాల్పడ్డారు, కడప నగరం ఎర్రముక్కపల్లి రైతు బజార్ సమీపంలోని ఎస్‌బీఐ ఎటిఎం ను ధ్వంసం చేసి అందులోని రూ. 6,19,300 నగదు దోచుకున్నారు.

- Advertisement -

అదేవిధంగా కడప నగరంలోనే ఎల్ఐసి విశ్వేశ్వరయ్య సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనానికి యత్నించగా పోలీస్ సైరన్ మోగడంతో దొంగలు పరారైనట్లు తెలుస్తోంది. మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ. 36 లక్షల నగదు దొంగల ముఠా దోచుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా వరుసగా ఏటీఎం ఘటన చోటు చేసుకోవడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వీటన్నింటిపై కేసులు నమోదు చేసి దొంగల ముఠా కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నారు.

కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీరియస్ గా తీసుకొని దొంగల ముఠా కోసం వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏ మేరకు విచారణ ప్రారంభమైనట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement