Thursday, December 5, 2024

Cuddapah – ఆటోను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – ముగ్గురు దుర్మరణం

పొరుమామిళ్ళ(కడప), డిసెంబర్ 2 (ఆంధ్రప్రభ) :కడపజిల్లా పొరుమామిళ్ళ కాలువ కట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్వీటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా నలుగురికి తీవ్ర గాయాల పాలయ్యారు.

పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన రోశయ్య (55) అక్కల రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్య ఆచారి (65) ఘటనా స్థలంలోని మృతిచెందారు. గాయపడ్డ వారిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి చెందారు. గాయపడిన వారిలో మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఆర్విటి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవరు అతివేగంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోరుమామిళ్ల పోలీసులు ప్రమాద స్థాయికి చేరుకొని ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement