Friday, September 20, 2024

AP | తుపాను, భారీ వర్షాలపై సీఎస్ సమీక్ష.

విజయవాడ: రాష్ట్రంలో తుపాను, భారీ వర్షాలపై (శనివారం) తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి సీసీఎల్‌ఏ జి. జయలక్ష్మి, జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్‌కుమార్‌ ప్రసాద్‌ సమీక్షించారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి విశాఖపట్నం-కళింగపట్నం మధ్య శనివారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోస్తా జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. లోత‌ట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం నేపధ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం రాత్రి కూడా తాడేపల్లి విపత్తుల నిర్వహణ సంస్థ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement