(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మను ఆంధ్ర ప్రదేశ్ సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు డా.కె.ఎస్.జవహర్ రెడ్డి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా.. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు.
శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు, వేదాశీర్వచనం చేయగా.. ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.
- Advertisement -