Tuesday, November 26, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. ద‌ర్శ‌నానికి 24గంట‌ల స‌మ‌యం

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా టిటిడి హిందూధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ‌హించారు.ఇవి భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుంచి ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన ఉషారాణి, హరినాథ్‌ల నృత్యం ఆకట్టుకుంది. అన్నమాచార్య కళామందిరంలో నెల్లూరుకు చెందిన సుధాకర్ బృందం సంగీతం, రామ‌చంద్ర పుష్కరిణి వ‌ద్ద హైదరాబాదుకు చెందిన లక్ష్మి బృందం సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో మచిలీపట్నం చెందిన వైష్ణవి నృత్యాలయం వారిచే నృత్య కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 74,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 23,931 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.68 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement