Thursday, December 12, 2024

AP | కేసీ కెనాల్ లో మొసలి హల్చల్..

పాములపాడు, (ఆంధ్రప్రభ): మండలంలోని భానుక చర్ల ఎర్త్ రెగ్యులేటర్ సమీపంలోని కేసీ కెనాల్‌లో మొసలి మొసలి హల్చల్ చేసింది. దీంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

గత కొన్ని రోజుల క్రితం తంగడంచ గ్రామం స‌మీపంలోని నేష‌న‌ల్ హైవేపై మొసలి క‌నిపించింది దీంతో రోడ్డుపై మొసలిని చూసిన ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి మొసలి కనిపించలేదు. రెండు రోజుల తర్వాత కెసి కాలువలో మొసలి సంచరిస్తూ కనిపించింది.

దీంతో ఒక్కసారిగా రైతులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుజాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు రిస్క్ టీం బీట్ ఆఫీసర్ పీరా కేసికినాల వద్దకు చేరుకొని గాలింపు చేపట్టారు. మొసలి కనిపించకపోవడంతో ప్రజలు, రైతులు కెసి కెనాల్‌లోకి వెళ్లవద్దని అధికారులు కోరారు. కెసి కెనాల్ మెట్లపై మహిళలు బట్టలు ఉతకడానికి వెళ్ళరాదని అన్నారు.

కెసి కెనాల్‌లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మొస‌లిని గుర్తించలేకపోతున్నామన్నారు. కెసి కెనాల్ నీటి ప్రవాహాన్ని తగ్గించి వీలైనంత త్వరగా మొసలిని పట్టుకునేందుకు కృషి చేస్తామని అటవీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement