Monday, November 18, 2024

AP: చెల్లెలి పుట్టుక‌పైనా విమ‌ర్శ‌లా… చంద్ర‌బాబు

జ‌గ‌న్ అస‌లు ముఖ్య‌మంత్రేనా
సోద‌రి చీర‌పైనా కుళ్లు జోకులా.
జ‌గ‌న్ ది వికృత‌మ‌న‌స్త‌త్వమ‌న్న చంద్రబాబు…

అమ‌రావ‌తి – తోడబుట్టిన చెల్లెలి పుట్టుకపై కూడా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపై కూడా విమర్శలు చేస్తున్నారని ఇలాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రా ? అని దుయ్యబట్టారు. ఇది చాలా నీచమని అన్నారు. వికృత మనస్తత్వం అంటే ఇది కాదా ? అని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే… పులివెందులలో ఈరోజు జగన్ మాట్లాడుతూ… షర్మిల, సునీతలపై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్ ఉనికి లేకుండా చేయాలనుకుంటున్న వారితో చేతులు కలిపిన వీళ్లా వైఎస్ వారసులు అని ప్రశ్నించారు. టీడీపీ కుట్రలో భాగస్వాములవుతున్న వీళ్లా వైఎస్ వారసులు అని మండిపడ్డారు. పసుపు చీర కట్టుకుని… వారి ఇళ్లకు వెళ్లి, వారి స్క్రిప్టు మేరకు పని చేసే వీళ్లా వైఎస్ వారసులు అని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement